FbTelugu

దిశా ఎన్ కౌంటర్ చిత్రంపై వర్మ స్పష్టత

మన న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన నమ్మకం ఉందని, నా వివాదాస్పద చిత్రాలు ఏవైనా సెన్సార్ నిబంధనలు పాటిస్తాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

దిశా ఎన్ కౌంటర్ చిత్రం విడుదలను రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని నిర్మాత హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చిత్రం విడుదలపై ట్వీట్ చేశారు. ఈ చిత్రం రెండు నెలల క్రితమే సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. కొన్ని కట్స్ తో పాటు టైటిల్ మార్చాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. న్యాయపరమైన నిబంధనలు పాటించి వారు ఒప్పుకున్న తరువాతే నా వివాదాస్పద చిత్రాలు గతంలో విడుదల చేశానని వర్మ గుర్తు చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశా ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దిశా ఎన్ కౌంటర్ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పై ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆశ ఎన్ కౌంటర్ పేరుతో చిత్ర నిర్మాణం జరిగిందని, కేంద్ర సెన్సార్ బోర్డు వీక్షించి ఏప్రిల్ 16న ఏ సర్టిఫికెట్ జారి చేసిందని నిర్మాత తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.