FbTelugu

వరవరరావు విడుదల

ముంబయి: విప్లవ రచయిత సంఘం (విరసం) సభ్యుడు పెండ్యాల వరవరరావును (82) నిన్న అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో నానావతి ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయ్యారు. ఆస్పత్రి నుండి విడుదలైన అనంతరం ముంబయిలోనే ఒక నివాసానికి తరలివెళ్లారు.
ముంబయి హైకోర్టు ఫిబ్రవరి 22న ఆరు నెలల ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆరు నెలల పాటు ముంబై విడిచి వెళ్లరాదని షరతు విధించింది. ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో ఆయనను మహారాష్ట్ర పోలీసులు 2018 ఆగస్టు 28న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన తలోజా జైలులో మగ్గుతున్నారు. ప్రముఖ లాయర్ ఇందిరా జైసింగ్ వరవరరావు తరఫున కోర్టులో వాదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.