FbTelugu

కాశీ ఆలయం, మసీదు సర్వేకు వారణాసి కోర్టు తీర్పు

లక్నో: అయోధ్యలో రామ మందిర వివాదం ముగిసి, ఆలయ నిర్మాణ పనులు జోరుగా సాగడంతో బిజెపి, ఆర్ఎస్ఎస్, హిందూ సంస్థలు కాశీ విశ్యనాధ ఆలయం, గ్యాన్ వాపి మసీదుపై దృష్టి సారించింది.

ఆలయం, మసీదు ను భారత పురావస్తు విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయడానికి అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆహ్వానించారు. సర్వే పూర్తి కాగానే అక్కడ మసీదు ను తొలగించి కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే భారత్ ను హిందూ దేశంగా మారుస్తామని సురేంద్ర సింగ్ స్పష్టం చేశారు. విశ్వనాథ ఆలయంలో మసీదు ఉన్న ప్రాంతం 2వేల ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైందన్నారు. 1664 లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించి అక్రమంగా మసీదు నిర్మాణం చేశారంటూ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం చేసిన ఆలయ ప్రాంగణాన్ని తిరిగి అప్పగించాలంటూ విఎస్.రస్తోగి అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) 2019లో వారణాసి కోర్టులో దాఖలు చేశారు. భారత పురావస్తు విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయించాలని ఆయన కోరారు. దీనిపై వాదోపవాదనల తరువాత వారణాసి కోర్టు తీర్పును వెలువరించింది. ఆలయం, మసీదు ప్రాంతాలను సర్వే చేయాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.