FbTelugu

నా విజయానికి వాళ్లిద్దరే: ఎమ్మెల్సీ వాణిదేవి

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో ఇద్దరు వ్యక్తులు కారణమని సురభి వాణిదేవి స్పష్టం చేశారు. ఒకరు మాజీ ప్రధాని పివి.నరసింహారావు కాగా మరొకరు సిఎం కెసిఆర్ అని అన్నారు.
ఇటీవల జరగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే. పివి.నరసింహరావు తెలంగాణ ముద్దుబిడ్డ అని, ఆయనపై ఉన్న గౌరవంతో తనకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారన్నారు. కెసిఆర్ కూడా తనకు టికెట్ ఇచ్చి, గెలుపు కోసం ఎంతగానో పాటుపడ్డారన్నారు. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు విజయం సాధించేందుకు అహర్నిషలు పనిచేశారని వాణిదేవి తెలిపారు.
పాజిటివ్ సోకింది…

తనకు కరోనా పాజిటివ్ సోకిందని, తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.