FbTelugu

ఏపీ ఎస్ఈసీ కార్యదర్శిగా వాణి మోహన్

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శిగా జి.వాణీమోహన్ ను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఐఎఎస్ (1996) బ్యాచ్ కి చెందిన వాణీమోహన్ ప్రస్తుతం కో-ఆపరేషన్ కమిషనర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ రెండు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్ నియమిస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఈ పోస్టులో నాన్ ఐఏఎస్ అధికారి పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) కొనసాగుతున్నారు.

You might also like