FbTelugu

షార్ట్ సర్క్యూట్ కాదు నిప్పంటించి చంపారు?

హైదరాబాద్: వనస్థలిపురం అగ్ని ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకున్నది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందని చెప్పడంలో నిజం లేదని ఫైర్ సిబ్బంది తేల్చారు.

మంగళవారం నాడు ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి బలవన్మరణానికి పాల్పడింది. భార్య భర్త మధ్య గొడవ కారణంగా ఆవేశంలో భార్య తనంతట తానే ఒంటికి నిప్పు అంటించుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన భర్త బాలకృష్ణ గాయాల పాలయ్యాడు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు రావడం చూసిన ఇరుగు పొరుగు వారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని ఫైర్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తరువాత నిజం బయటపడింది. నిప్పు అంటించుకోడంతోనే మృతి చెందినట్టు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. భర్త బాలకృష్ణ మాట్లాడలేని స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.