FbTelugu

దైవదర్శనానికి వెళ్తూ వ్యాన్ బోల్తా

విశాఖపట్నం: కొందరు భక్తులు దైవదర్శనానికి వ్యాన్ లో వెళుతుండగా బోల్తాపడి ఓ మహిళ మృతి చెంది, మరో 20 మందికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని ముంచంగిపిట్ట మండలం, వనసపుట్టు దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెదబయలు మండలం, గడుగుపల్లి గ్రామానికి చెందిన కొందరు భక్తులు ఒడిషాలోని ఓ దేవాలయంలో దైవదర్శనానికి వ్యాన్ లో వెళుతుండగా.. ప్రమాదవ శాత్తూ వనసపుట్టు దగ్గర బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.