FbTelugu

చేపల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా

పశ్చిమగోదావరి: చేప పిల్లల లోడుతో వెళుతున్న ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనాయి. ఈ ఘటన టంగుటూరు మండలం చేబ్రోలు రహదారిపై చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. చేపపిల్లలను వ్యాన్ లో తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు చేబ్రోలు రహదారిపూ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆ వ్యాన్ లోని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనాయి. చేప పిల్లలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు చేపపిల్లలను ఏరుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

You might also like