FbTelugu

ట్విటర్ లో ఊపేస్తున్న వకీల్ సాబ్

సంవత్సరం ముగుస్తుండడంతో సోషల్ మెస్సేజింగ్ సర్వీసు ట్విటర్ ఈ ఏడాదికి సంబంధించిన లెక్కలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. 2020లో ఏ హీరో, హీరోయిన్ పేరు బాగా ట్రెండ్ అయ్యిందనే వివరాలు వెల్లడించింది.
ఏ సినిమా టాప్ లో ఉందనే లెక్కలు ప్రకటించింది.

టాలీవుడ్ లో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం టాప్ లో నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ఒక పాట ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. కేవలం ఈ రెండింటితోనే ఈ సినిమా టాప్ రేంజ్ లోకి వెళ్లిపోయింది. మోస్ట్ ట్వీటెడ్ సినిమా అని ప్రకటించడంతో ఈ వార్త విన్న పవన్ అభిమానులు మహానందపడిపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.