FbTelugu

వకీల్ సాబ్ కు ఎదురుదెబ్బ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే టికెట్లు విక్రయించాలని, అదనంగా ఒక్క పైసా వసూలు చేయవదని ఏపి హైకోర్టు స్పష్టం చేసింది. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ వాదనలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది.

వకీల్ సాబ్ సినిమా టికెట్లు రేట్లు మూడు రోజుల పాటు పెంచుకునేందుకు సింగిల్ జడ్జి శుక్రవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో సినీ నిర్మాతలు, థియేటర్ యజమానులు ఆనందపడ్డారు. వారి ఆనందం ఆవిరి అయ్యేలా ఏపి ప్రభుత్వం సింగిల్ జడ్డజి ఆదేశాలను ఇవాళ ఉదయం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ, టికెట్ల ధరలను పెంచుకోవడానికి అధికారం లేదంటూ స్పష్టం చేసింది. తాజా తీర్పుతో సినిమా థియేటర్ యజమానులు, నిర్మాతకు ఎదురు దెబ్బ తగిలింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.