FbTelugu

మళ్లీ తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం

కాశ్మీర్: కరోనా వైరస్ కారణంగా మార్చి 18వ తేదీ మూతపడిన వైష్ణోదేవి ఆలయం మళ్లీ ఆదివారం తెరుచుకున్నది. ఇవాళ భక్తులను ఆలయంలోనికి అనుమతించారు.

అయితే దర్శనాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి చేశారు. ఈ వారం రెండు వేల మందికి అనుమతిస్తుండగా జమ్మూవాసులు 1900 మంది, ఇతర ప్రాంతాల వారు వేయి మందికే దర్శనం కల్పించారు. దర్శనానికి వచ్చే ముందు కరోనా పరీక్షలు నిర్వహించుకున్న తరువాతే ఆ పత్రాలను తీసుకుని రావాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు ఆరోగ్య సేతు యాప్ ను మొబైల్ ఫోన్ లో పెట్టుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు.

You might also like