ఆ రెండు కలిస్తే ఎలా ఉంటాయి?
వాషింగ్టన్: ప్రపంచంలో ఇప్పటికే రెండు కరోనా వ్యాక్సిన్లకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేశాయి. మరికొన్ని వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ఇవి కూడా మార్కెట్ లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల విజయ శాతం మరింగా పెంచేందుకు శాస్త్రవేత్తలకు వినూత్న ఆలోచన వచ్చింది. రెండు వాక్సిన్లను కలిపి ప్రయోగాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకటి రష్యా ప్రభుత్వం తయారు చేసిన స్పుత్నిక్ కాగా మరొకటి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్. స్పుత్నిక్ ను రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తయారు చేయగా, ఆస్ట్రాజెనెకా ను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసింది. స్పుత్నిక్ ను రష్యా పౌరులు వేసుకుంటుండగా, ఆక్స్ ఫర్డ్ తయారు చేసి ఆస్ట్రాజెనెకా ఇంకా తుది దశలో ఉంది. ఈ రెండు కూడా జలుబుకు కారణమువుతున్న వైరస్ ల నుంచే తయారు చేసినవి.
ఒకే రకమైన వైరస్ నుంచి తయారు చేసిన స్పుత్నిక్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను కలిపి పరిశోధన చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయానికి వచ్చారు. రెండు వ్యాక్సిన్లను కలపడం వల్ల మెరుగైన ఫలితాలు లభించిన పక్షంలో కొత్త వ్యాక్సిన్ రష్యానే తయారు చేస్తుందని రష్యా సావరని వెల్త్ ఫండ్ ప్రకటించింది.
సోవియట్ యూనియన్ గా ఉన్న సమయంలో రోదసిలోకి స్పుత్నిక్ వి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఆ పేరునే కొవిడ్ వ్యాక్సిన్ కు పెట్టారు. 92 శాతం సక్సెస్ కావడంతో మార్కెట్ లోకి విడుదల చేసింది.