FbTelugu

ముంబయిలో అడుగంటిన వ్యాక్సిన్ నిల్వలు

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. మరో మూడు రోజులకు సరిపడిన నిల్వలు మాత్రమే ఉండడంతో కలవరపడుతున్నది. మూడు రోజుల్లో నిల్వలు అడుగంటితే పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడింది.

వ్యాక్సిన్లను వెంటనే సరిపడా సరఫరా చేయాలంటూ మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్  కేంద్రానికి వినతి చేశారు. ముంబై నగరంలో వేగంగా నిల్వలు తగ్గుతున్నాయని, అందుకు తగ్గట్టుగా సరఫరా పెంచాలని కోరారు. ప్రస్తుతం 14 లక్షల డోసులు మాత్రమే నిల్వలు ఉన్నాయని, ఇవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయన్నారు. ప్రతి వారం 40 లక్షల డోసులు అవసరం ఉంటాయని రాజేష్ తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 82 లక్షల మంది కి వ్యాక్సినేషన్ చేశారు. ఇప్పటి వరకు కేంద్రం 1.06 కోట్ల డోసులు పంపించగా, మూడు శాతం డోసులు వృధా అయ్యాయి.

మహారాష్ట్రలో కేసులు భయంకరంగా పెరుగుతున్నందున పాతికేళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు డోసులు ఎక్కువ సంఖ్యలో పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. 45 సంవత్సరాలు దాటిన వారికి మూడు వారాల్లో వ్యాక్సినేషన్ చేసేందుకు 1.5 కోట్ల డోసులు తక్షణమే పంపించాలని ప్రధానికి లేఖ రాశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.