FbTelugu

ఇంటింటికి వ్యాక్సిన్ స్లిప్పులు

అమరావతి: వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తోపులాట, రద్దీ నివారించేందుకు ఏపిలో సోమవారం, మంగళవారం నాడు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం నిలిపివేశారు. ఈ సమాచారాన్ని ఇప్పటికే ముందస్తుగా బుక్ చేసుకున్నవారికి మెస్సేజీలు పంపించారు.

ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటతో ఏపి సర్కార్ వ్యూహం మార్చింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు ఇంటింటికి పంపించనున్నారు. ఎవరికి ఏ సమయానికి కి వ్యాక్సిన్ వేస్తారనే సమాచారంతో స్లిప్పులు ఇళ్లకే పంపిణి చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.