FbTelugu

18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇవ్వాలి…

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

దేశంలో వెంటనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా చేపట్టాలని, లేదంటే మరిన్ని కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ కు అనుమతించాలని లేఖలో కోరారు. 18 ఏళ్లు పైబడిన వారందరికి అవకాశం కల్పించడం మూలంగా ఎవరు ముందు వస్తే వారికి ఇచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు.

24 గంటల్లో 43 లక్షల మందికి వ్యాక్సినేషన్…

దేశంలో తొలిసారిగా ఒక రోజు వ్యవధిలో 43 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇందులో తొలి డోసు తీసుకున్న వ్యక్తులు 39 లక్షలు కాగా రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, యుపి, బెంగాల్ లో తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.