FbTelugu

వ్యాక్సిన్ మస్తు పని చేస్తున్నది: పుతిన్

ఇద్దరు కుమార్తెలకు అప్పుడే ఇప్పించాను

మాస్కో: తన ఇద్దరి కుమార్తెలకు కరోనా వ్యాక్సిన్ వేయించినట్లు రష్యా అధ్యక్షులు వాద్లిమిర్ పుతిన్ స్వయంగా తెలిపారు. మంగళవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

ప్రయోగ దశలో ఇచ్చిన వ్యాక్సిన సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యిందని, వేయించుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందన్నారు. ప్రపంచ మార్కెట్ లోకి ఈ నెల 12వ తేదీన (రేపే) విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత ఈ వ్యాక్సిన్ ను వృద్ధులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఇవ్వనున్నట్లు రష్యా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

You might also like