FbTelugu

ఒక వ్యాక్సిన్ మూడో దశలో ఉంది!

ఢిల్లీ: కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేకపోవడంతో ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఇద్దరు కలిసి చోట ఇదే చర్చించుకుంటున్నారు. వీరందరి ఆశలు చిగురించేలా కేంద్రం చల్లటి కబురు చెప్పంది.

దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా ఒక వ్యాక్సిన్ మాత్రం మూడో దశ ట్రయల్స్ కు సిద్ధమైనట్లు నీతి ఆయోగ్ ప్రతినిధి వీకే.పాల్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే ఏ కంపెనీకి చెందినది అనే విషయాన్ని మాత్రం ఆయన బహిర్గత పర్చలేదు.

You might also like