FbTelugu

ఏపి లో అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ

ఇవాల్టి నుంచే నైట్ కర్ఫ్యూ

అమరావతి: రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని సిఎం వైఎస్.జగన్ తెలిపారు. మే 1 నుంచి వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్నారు.

ఏపిలో 18-45 ఏళ్ల వయసు వున్న వారు 2,04,70,364 మంది ఉన్నట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. కరోనా కల్లోలాన్ని నిరోధించేందుకు శనివారం రాత్రి నుంచే కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉచిత వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్నారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆసుపత్రులలో మంచాలను పెంచాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.