FbTelugu

రేపటి నుంచే వృద్ధులకు వ్యాక్సిన్

హైదరాబాద్: తెలంగాణ లో సోమవారం నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరు పదులు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గుర్తింపు కార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాలని లేదా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలన్నారు.

covin.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఆన్ లైన్ లో నమోదు అయిన వారికే ఇస్తామని, ప్రభుత్వ కేంద్రాల్లో అయితే ఉచితంగా లభిస్తుందని శ్రీనివాస్ రావు అన్నారు.
రాష్ట్రంలో 45 ప్రభుత్, 57 ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని ఆయన చెప్పారు. ఒక్క హైదరాబాద్ నగరంలో 12 కేంద్రాలు ఉన్నాయన్నారు. తొలి డోస్ తీసుకున్నవారు 28 నుంచి 45 రోజుల్లోపు రెండో డోస్ కచ్చితంగా తీసుకోవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో మరో వేయి కేంద్రాలను పెంచుతామని శ్రీనివాస్ రావు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.