FbTelugu

ఆగస్టు కల్లా చిన్నారుల వ్యాక్సిన్

న్యూఢిల్లీ: దేశంలో 12-18 ఏళ్ల మధ్య ఉన్నవారి కోసం ఆగస్టు నెలలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని కరోనా వర్కింగ్ గ్రూపు చైర్మన్ డాక్టర్ అరోరా తెలిపారు.
జైడస్ క్యాడిలా కంపెనీ చిన్నారుల వ్యాక్సిన్ తాయారు చేస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తైనట్లు ఆయన వెల్లడించారు.

ఆగస్టు కల్లా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అన్నారు. దేశమంతా థర్డ్ వేవ్ పై ఆందోళన పడుతున్న సమయంలో జైడస్ క్యాడిలా మంచి వార్త చెప్పిందన్నారు. దేశంలో రోజుకు ఒక కోటి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.