FbTelugu

రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్: మంత్రి ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటాను అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజవంతమైందని అయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. స్ట్రెయిన్‌ వైరస్ తో భయం లేదని, బర్డ్‌ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. బర్డ్‌ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల ధైర్యం, ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ అంతగా విజృంబించలేదని ఈటల తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.