FbTelugu

ఎక్కడికైనా 5 రోజుల్లో వ్యాక్సిన్ డెలివరీ

వాషింగ్గన్: ప్రపంచంలో ఏ మూలకైనా ఒక రోజు నుంచి ఐదు రోజల్లోపు కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేస్తామని దిగ్గజ కొరియర్ సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. తమ సర్వీసులను 220 దేశాల్లో ఒక మూల నుంచి మరో మూలకు అందించగలని తెలిపింది.

అది కూడా మైనస్ 75 డిగ్రీల్లో వ్యాక్సిన్లను రవాణా చేస్తామని వెల్లడించింది. గత ఏడాది కాలంగా ప్రపంచాన్నే కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక రంగం అతలాకుతలం అయ్యింది. ఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ యురోపియన్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాక్సిన్ 75 సెల్సియస్ డిగ్రీల్లో నిల్వ చేసి రవాణా చేయాల్సి ఉంటుంది.

డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ 220 దేశాల్లో నెట్ వర్క్ కలిగి ఉంది. ఈ 220 దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ఎల్ సీఈఓ జాన్ పియర్సన్ ప్రకటించారు. సాధారణ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి 1 నుంచి 5 రోజుల మధ్య డెలివరీ చేస్తామని తెలిపారు. ఇప్పుడు కూడా అదే వ్యవధిలో వ్యాక్సిన్లను రవాణా చేస్తామన్నారు. గత రెండు దశాబ్ధాలుగా మెడికల్ ఎక్స్ ప్రెస్ పేరుతో క్రిటికల్ ప్రొడక్టులు, మెడికల్ పరికరాలను రవాణా చేస్తున్న అనుభవం ఉందని పియర్సన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.