FbTelugu

గుర్రపు యాంటీ బాడీతో వ్యాక్సిన్: హెచ్ సీయూ

హైదరాబాద్: కరోనా కట్టడికి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిశోధనలు మొదలు పెట్టినట్టు వీసీ అప్పారావు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు.

గుర్రపు యాంటీ బాడీ ద్వారా కరోనాకు వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. అనేక వ్యాధులను అరికట్టడంలో గుర్రపు యాంటీబాడీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అతి తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పరిశోధనల్లో ఇతర దేశాల కంటే మనమే చాలా ముందున్నామని తెలిపారు.

You might also like