FbTelugu

4 నెలల్లో చిన్నారుల వ్యాక్సిన్ లభ్యం

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ లో చిన్నారులపై వైరస్ ప్రభావం అధికంగా చూపనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నెల రోజులగా కంపెనీలు చిన్నారుల వ్యాక్సిన్ తయారీ పై దృష్టి సారించాయి.

ఇప్పటికే అమెరికాలో చిన్నారుల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా ఇండియాలో ట్రయల్స్ మొదలయ్యాయి. మూడు నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. ఇది మ్యూకోర్ మైకోసిసి అని బ్లాక్ ఫంగస్ కాదని ఆయన స్పష్టం చేశారు. కరోనా తగ్గించేందుకు స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించడం మూలంగా డయాబెటిక్ ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తున్నదని ఆయన వివరించారు. బ్లడ్ క్లాట్ లను నిరోధించేందుకు బ్లడ్ థిన్నర్లను అధికంగా వినియోగిస్తున్నారని, దీనివల్ల అధిక రక్తస్రావం జరుగుతున్నదన్నారు. డి.ఆర్.డి.ఓ తయారు చేసిన 2డిజి ఔషధం గేమ్ ఛేంజర్ అనడం తొందరపాటు అవుతుందని, ఫలితాలు చూడాల్సి ఉందన్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మున్ముందు బూస్టర్లు తీసుకునే అవసరం రావచ్చని గులేరియా వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.