FbTelugu

ఎన్నికల సిబ్బందికి వ్యాక్సినేషన్: ఎన్నికల కమిషన్

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే విధుల సంరక్షణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పుడే చర్యలు ప్రారంభించింది. విధుల్లో పాల్గొనేవారికి ఫ్రంట్ లైన్ వారియర్ తో పాటు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచించింది.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల మాదిరి శానిటైజర్లు, మాస్కులు సరఫరా చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తొలుత ప్రారంభించే కరోనా వ్యాక్సినేషన్ లో ఫ్రంట్ లైన్ వారియర్ తో సమానంగా ఎన్నికల సిబ్బందిని పరిగణించాలని కోరింది.

ఎన్నికల విధులను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరోగ్య భద్రత చర్యలు తీసుకున్నది. దేశ వ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.