FbTelugu

ఆ దేశంలో వ్యాక్సిన్ వద్దంటే పెద్ద శిక్షలు

ఇస్లామాబాద్: మత ఛాందసవాద భావజాలంతో ఉన్న పాకిస్థానీయులు వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. ఎంతగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా పౌరులు బేఖాతరు చేస్తున్నారు.

పౌరులు ఎంత చెప్పినా దారికి రాకపోవడంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండడంతో స్వరం పెంచింది. ఇకనుంచి ఎవరైనా వ్యాక్సిన్లు వేసుకోనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సాధారణ పౌరులు వేయించుకోనట్లయితే మొబైల్ సిమ్ లను బ్లాక్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం చట్ట సవరణ కూడా చేస్తోంది. ఎలా అమలు చేయాలనే దానిపై టెలికాం సంస్థలతో చర్చలు జరుపుతున్నాన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారిని సినిమా హాలుకు, వేడుకలకు, ప్రార్థనా మందిరాలకు అనుమతిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు నిలిపివేస్తామని ప్రకటించింది. తొలి డోసు వేసుకున్నవారు రెండో డోసు వేసుకోవడం లేదు. మెజారిటీ ప్రజలు తొలి డోసు కూడా వేసుకోవడం లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే పురుషుల్లో మగతనం ఉండదని, మహిళలకు గర్భం రాదని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో భయపడిన పలువురు ఆమడ దూరంలో ఉంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.