FbTelugu

టీకా సాకు.. ఎన్నికల ఎత్తుగడే

హైద‌రాబాద్: భారత ప్రధాని మోదీ టీకా పరిశీలన సాకుతో హైదరాబాద్ లో పర్యటన ఎన్నికల ఎత్తుగడేనని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ ఆరోపించారు. ఈ సందర్భంగా నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా పాల్గొనడం దౌర్భాగ్యమని అన్నారు.

కోవిడ్‌ ను అడ్డం పెట్టుకొని సాక్షాత్తు దేశ ప్రధాని భారత్ బయోటెక్ భుజాల మీద కూర్చొని ప్ర‌తిప‌క్షాల‌పై తుపాకి పేలుస్తున్నార‌ంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో ఉంద‌న్నారు. మోదీ నిజంగా కరోనా వ్యాక్సిన్ సందర్శ‌న‌కే వస్తే.. సీఎం ని కూడా తన పర్యటనలో భాగస్వామిని చేయాల‌్సిందన్నారు. తాజా మోదీ చర్యలు అధికార దుర్వినియోగమేనని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.