FbTelugu

డిసెంబర్ 11న యూఎస్ లో వ్యాక్సినేషన్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో డిసెంబర్ 11 లేదా 12న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశాలను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తున్నది. వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లోయి ఈ మేరకు వెల్లడించారు.

తమ వ్యాక్సిన్ ను అనుమతించాల్సిందిగా ఫైజర్-బయో ఎన్ టెక్ కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10న అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ అడ్వయిజరీ కమిటీ సమావేశమవుతున్నది. కమిటీ వ్యాక్సిన్ ను ఆమోదిస్తే 24 గంటల వ్యవధిలోనే అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే డిసెంబర్ 11 లేదా 12వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని డాక్టర్ మోన్సెఫ్ తెలిపారు. వ్యాక్సినేషన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, దేశ జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్ ఇమ్యునిటీ వస్తుందని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.