FbTelugu

7 నుంచి యూకేలో వ్యాక్సినేషన్

లండన్: యునైటెడ్ కింగ్ డమ్ లో డిసెంబర్ 7వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యావత్ ప్రపంచ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్న ఫైజర్-బయో ఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కరోనా వైరస్ యావత్ ప్రపంచ సమస్యగా పరిణమించడంతో పాటు సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది దీని బారిన పడి చికిత్స తీసుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నబిన్నమైన విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకురావడంపై బ్రిటన్ ప్రభుత్వం హర్ష్యం వ్యక్తంచేసింది. ఇవాళ బ్రిటన్ ప్రభుత్వ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఫైజర్ వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది.

దేశంలో తొలుత వైద్య సిబ్బంది, 80ఏళ్లు పైబడిన ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది. అయినప్పటికీ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగైదు వ్యాక్సిన్లు మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కరోనాపై సైన్స్ విజయం సాధించిందని, ప్రజల రక్షణ కోసం యూకె ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల ఫైజర్ కంపెనీ సీఈఓ అల్బర్ట్ బొర్లా ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రజలకు సురక్షితంగా వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చేవారం ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని బ్రిటన్ ఆరోగ్య కార్యద్రశి మట్ హాంకాక్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.