FbTelugu

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్: ఈటల

హైదరాబాద్: ఇప్పటివరకు మెడికల్ కాలేజీలో, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో మాత్రమే వాక్సిన్ ఇచ్చామని, ఈ రోజు నుండి ప్రాధమిక అరోగ్య కేంద్రాలలో సైతం ఇస్తారని అన్నారు. ప్రజలందరూ విధిగా వాక్సిన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వాక్సిన్ అందిస్తున్న విధానంపై సమీక్షించారు. ఈ రోజు నుండి 45 సంవత్సరాలు పైబడిన  వారందరికీ వాక్సిన్ అందిస్తున్నామన్నారు. వాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి ని  సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చన్నారు. ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరవవద్దని కోరారు. సమావేశం తరువాత కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, డైరెక్టర్ల తో, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.