FbTelugu

28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం సూపర్ స్ప్రెడర్లకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్ర్పెడర్లకు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు. మొదట గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, హోటల్ సిబ్బంది, సెలూన్ సిబ్బంది, కూరగాయల వర్తకులు, పండ్లు, పూల వ్యాపారులు, హమాలీలు, కిరాణ దుకాణం యజమానులు, రేషన్ డీలర్లు, గ్యాస్ బాయ్స్, మద్యం దుకాణం సిబ్బందిని సూపర్ స్ప్రెడర్స్ గా ప్రభుత్వం గుర్తించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.