FbTelugu

15 కల్లా జిహెచ్ఎంసిలో అందరికీ వ్యాక్సినేషన్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లో పారిశుధ్య కార్మికులనుండి మొదలు కమిషనర్ వరకు కరోనా వాక్సిన్ ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

అందరికీ ఏప్రిల్ 15 వ తేదీ లోగా వాక్సిన్ వేయడం పూర్తి చేయాలని కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ కమిషనర్లకు స్పష్టం చేశారు. జోనల్ కమిషనర్లతో కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సినేషన్ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రధాన కార్యాలయానికి పంపడంతో పాటు వివరాలను కోవిడ్ పోర్టల్ లోకి ఎక్కించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సుమారు 30 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారన్నారు. ఈనెల 15 వ తేదీ తర్వాత ప్రతిఒక్కరు అధికారి, సిబ్బంది విధిగా వాక్సిన్ వేసుకొనే కార్యాలయానికి రావాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.