గుంటూరు: కరోనా టీకా తీసుకున్న తర్వాత ఓ ఆశాకార్యకర్త అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకెళితే.. తాడేపల్లి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గొట్టిముక్కల లక్ష్మి, ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మిలకు ఈ నెల 20 న కరోనా టీకా వేయించుకున్న తర్వాత అస్వస్థతకు గురైనారు. దీంతో వారిని జిల్లాలోని జీజీహెచ్ కి తరలించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ కు గురైనట్టు వైద్యులు తెలిపారు.
అయితే విజయలక్ష్మికి వేసిన టీకా వయల్ నుంచే మరో డాక్టర్ కు వ్యాక్సిన్ వేసినా.. అతనిలో ఎటువంటి రియాక్షన్ లేదని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ తో విజయలక్ష్మి మృతి చెందినట్టుగా డీఎంహెచ్ఓ తెలిపారు. జీజీహెచ్ దగ్గర ఆశావర్కర్లు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడికి చేరుకున్న కలెక్టర్, డీఎంహెచ్ఓ బాధిత కుటుంబంతో మాట్లాడారు. జిల్లాలో 10 వేల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారని ఎవరికీ ఎలాంటి సమస్య రాలేదని తెలిపారు.