FbTelugu

ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి: కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని సిఎం సూచించారు.

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై సిఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో  భర్తీ చేయాలన్నారు. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని సిఎం అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.