వేణుశ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ సాబ్ సినిమా ఉగాది రోజున విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై పవన్ అభిమానులు గంపెడాశ పెట్టుకున్నారు.
బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మాణం చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిసస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై రిలీజు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని వెచ్చించి రైట్స్ కొనుగోలు చేసింది. సినిమా థియేటర్లలో 50 రోజులు నడిచిన తరువాతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదల చేయాలని షరతు విధించారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుండగా, మే నెలాఖరులో అమెజాన్ ప్రైమ్ లో కన్పించనున్నది. ఇంతకు ముందే జీ తెలుగు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది.
ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒకటి, సాగర్ చంద్ర దర్శకత్వంతో పాటు మరో సినిమా చేస్తున్నారు. నాలుగు సినిమాలకు సుమారు రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.