FbTelugu

కుంభ మేళా ఎఫెక్ట్… చార్ ధామ్ రద్దు

రాంచి: కుంభ మేళాపై విమర్శలు వెల్లువెత్తడం, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పలేదు.
ఈ ఏడాది కేవలం నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని సిఎం తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం మే 14వ తేదీనుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా రద్దు చేశారు. ప్రతి సంవత్సరం గర్వాల్ ప్రాంతంలో బదరీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల్లో చార్ ధామ్ నిర్వహిస్తారు.

సెకండ్ వేవ్ ఉధృతి ఉన్నప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజయవంతంగా కుంభమేళాను నిర్వహించిది. కుంభమేళా కారణంగానే దేశంలో కరోనా కేసులు పెరిగాయని విమర్శలు రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్దలు గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నందున రోజుకు కనీసం 50వేల పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చార్ ధామ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.