FbTelugu

మళ్లీ దూషించిన ఉత్తరాఖండ్ సీఎం

రాంనగర్: ప్రభుత్వం చౌక ధరలకు అందించే రేషన్ ఎక్కువ కావాలని అనుకునేవారు మరింత మంది పిల్లలను కనాల్సింది కదా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పేద కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నది. ఇంట్లో పది మంది ఉన్నట్లయితే 50 కిలోలు, ఇరవై మంది ఉంటే వంద కిలోలు ఇస్తారు. వాళ్లకు ఎక్కువ రేషన్ వస్తున్నది, మాకు తక్కువ రేషన్ వస్తున్నదని అసూయ ఎందుకుని ఆయన ప్రశ్నించారు. మీకు సమయం ఉంది కాదా… అప్పుడెందుకు 20 మంది పిల్లలను కనలేదని తీరత్ నోరుపారేసుకోవడంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఇద్దరు పిల్లల తల్లి కూడా చిరిగిన జీన్స్ వేసుకున్నదంటూ ఇటీవల సిఎం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నిన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు అమెరికా పాలించిందని విమర్శించారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కట్టడి కాలేదని, భారత్ లో కట్టడిలోనే ఉందని సిఎం ఉదహరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.