FbTelugu

హిమపాతం… మరో 38 మంది కోసం గాలింపు?

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ హిమపాతంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, మరో 38 మంది కోసం ఆర్మీ జవాన్లు, సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. గాయాలపాలైన కొందరిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు.

హిమపాతం ఘటన సంభవించిన ప్రాంతంలో మొత్తం 430 మంది బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో వీరందరూ పనిచేస్తుండగా హిమపాతం కురవడంతో ప్రమాదం జరిగింది. 8 మంది చనిపోగా, 384 మందిని సురక్షితంగా రక్షించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందిని వైద్యులు తెలిపారు. 430 మందిలో 392 మందిని మినహాయిస్తే మరో 38 మంది ఆచూకి కనుగొనాల్సి ఉంది. వీరి కోసం ఇవాళ ఉదయం నుంచి వెతుకుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.