FbTelugu

కాంగ్రెస్ పునర్ వైభవం అసాధ్యం: జితిన్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, బ్రాహ్మణ కుల బలమున్న నేత జితిన్ ప్రసాద ఇవాళ బిజెపి కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
దేశ ప్రయోజనాల కోసం బిజెపి పార్టీ పాటుపడుతుండడంతో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ క్షీణస్థితికి చేరుకుందని, అది ఇప్పట్లో కోలుకుని తిరిగి పునర్ వైభవం సాధించడం అసాధ్యమన్నారు. తాను బిజెపిలో చేరాలని రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోలేదని, రాహుల్, సోనియా వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జితిన్ తెలిపారు. జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీలో సలహాదారుడి వ్యవహరించారు. రాజీవ్ గాంధీ, పివి.నరసింహారావు ల వద్ద సలహాదారుగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో ఆయన కుమారుడు జితిన్ ప్రసాద కేంద్ర మంత్రిగా పనిచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.