FbTelugu

ఎట్టకేలకు ఉత్తమ్ రాజీనామా

హైదరాబాద్: హమ్మయ్య… పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మొన్నటికి మొన్న దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయినా, తన భార్య పద్మావతి రెడ్డి హుజూర్ నగర్ లో ఓటమి పాలైనా ఆయన రాజీనామా సమర్పించలేదు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. ఇంకా కొన్ని రోజుల పాటు పదవిలో కొనసాగితే పరువు పోతుందనే ఉద్దేశంతో కూర్చి వదిలేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు, 2019 పార్లమెంటు ఎన్నికలకు నైతి బాధ్యత వహించకుండా పదవిని అట్టిపెట్టకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్ రెడ్డి, ఆ కోరిక తీరకుండానే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.