FbTelugu

కేసీఆర్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. తనను రెండ్రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అరెస్టు చేయడం దారుణమన్నారు.

తమ గురించి కేసీఆర్ ఎందుకు అంతలా భయపడుతున్నాడని ప్రశ్నించారు. తాను మంజీరా ప్రాజెక్టులో పడిపోతున్న నీటిమట్టాన్ని పరిశీలించడానికి వెళుతుండగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.

You might also like