FbTelugu

పీవీ జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: ఉత్తమ్

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించి మాట్లాడారు.

సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా ఎదిగిన నేత అన్నారు. ల్యాండ్ సీలింగ్ పేరుతో పేదలకు సాయం చేసిన ఘటన పీవీదేనని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

 

You might also like