FbTelugu

చైనా చుట్టూ గ్లోబల్ ఆర్మీ దించుతాం: యూఎస్ఏ

చైనా లిబరేషన్ ఆర్మీతో పలు ఆసియా దేశాలకు ముప్పు ఉందని భావిస్తున్నామని, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ గ్లోబల్ ఆర్మీని మోహరించే దిశగా ఆలోచిస్తున్నామని  అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.

చైనా సైన్యంతో ఇండియాకు ప్రమాదం పొంచివుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇండియాతో పాటు మలేసియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర ఎన్నో దేశాలకు ముప్పు ఉందని పాంపియో అన్నారు. గురువారం నాడు జర్మన్ మార్షల్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన వర్చ్యువల్ బ్రసెల్స్ ఫోరమ్ 2020లో పాంపియో పాల్గొన్నారు. చైనా దేశం వ్యవహారంపై ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో ఎక్కడెక్కడ గ్లోబల్ ఫోర్స్ ను నియమించాలన్న విషయమై సమీక్షలు నిర్వహించి చాలా రోజులు అయిందన్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం సమీక్ష జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరోసారి సమీక్షించలేదని, మారిన పరిస్థితుల నేపథ్యంలో సమీక్షిస్తామన్నారు.

చైనా సైన్యాన్ని నిలువరించేందుకు గ్లోబల్ ఆర్మీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నామని ఆయన వివరించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు మద్దతిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

ఇదులో భాగంగానే జర్మీనలోని మా సైన్యాన్ని 52 వేల నుంచి 25 వేలకు తగ్గించామని పాంపియో వెల్లడించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా కొన్ని దేశాలకు ప్రమాదం పొంచివుందన్నారు. ఇండియా సహా పలు దేశాలు ఈ ముప్పు అంచున ఉన్నాయన్నారు. కొన్ని దేశాలు తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు చేయడం లేదని, ఆ పరిస్థితి మారాలి అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా అలాంటి వారు ముందుకు వస్తే, మా వంతు సాయం చేస్తామని పాంపియో తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.