FbTelugu

చైనా ఒలంపిక్స్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ అమెరికా అధ్యక్ష పదవి దిగిపోయే వరకు నానా యాగి చేసిన డొనాల్డ్ ట్రంప్, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కాస్త తగ్గింది. ట్రంప్ మాదిరి చైనా ను దూషించడం లేదు.

తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి ఫెలోసి చైనా దేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే ఒలింపిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు గాను చైనా ఒలింపిక్స్ న దౌత్యపరంగా వెలివేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు ఎవరూ హాజరు కావద్దని, ఒకవేళ వెళ్తే నైతిక బలాన్ని కోల్పోయినట్లు అవుతుందని అన్నారు. చైనాలో జరిగే ఒలింపిక్స్ ను బహిష్కరించాలి లేదా ఆ దేశం నుంచి మరో దేశానికి మార్చాలనే డిమాండ్ అమెరికాలో మళ్లీ ఊపందుకున్నది. చైనా ఎప్పటినుంచి ముస్లిం లను ఊచకోత కోయడంతో పాటు తీవ్ర నిర్భంధానికి గురి చేస్తున్నదని, అమెరికా మౌన చైనాను ప్రోత్సహించేదిగా ఉందనే విమర్శలు ఉన్నాయి.

కాంగ్రెస్ ద్విపక్ష కమిటీ ముందుకు హాజరైన ఫెలోసి కూడా ముస్లింల ఊచకోతపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. కీలక స్థానంలో ఉన్న ఆమె అభిప్రాయానికి విలువ ఉండడంతో పాటు డెమోక్రాటిక్ ప్రభుత్వం కావడంతో బహిష్కరణకే మొగ్గు చూపే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.