FbTelugu

పోరాటం ఆగదు… బాధ్యతలు అప్పగిస్తా: ట్రంప్

వాషింగ్టన్: నిబంధనల ప్రకారం ఈ నెల 20వ తేదీన అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఇప్పటి మాదిరే ఎన్నికల ఫలితాలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

జోసెఫ్ ఆర్.బైడెన్ 46వ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందినట్లు యూఎస్ కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాలతో పూర్తిగా విభేదిస్తున్నానని ట్రంప్ అన్నారు. దేశ అధ్యక్ష చరిత్రలో ఇది నా మొదటి పర్యాయానికి ముగింపు కావొచ్చని, దేశం పూర్వ వైభవాన్ని సాధించేందుకు మేము చేసే చేసే పోరాటానికి ఇది ఆరంభం కావచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.