FbTelugu

ఇండియాను వీడండి: యుఎస్ ఆదేశం

వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంతర్జాతీయ పత్రికలు ఘోషించడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. వీలైనంత త్వరగా ఇండియాను వీడాల్సిందిగా అమెరికా తమ దేశ పౌరులను ఆదేశించింది.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇండియా లో కరోనా కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం దుర్లభం అని స్పష్టం చేసింది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న అమెరికా పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఇండియాలో ఆరోగ్య పరిస్థితి అదుపులో లేకపోవడంతో ఈ మేరకు లెవల్ 4 హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న రోజువారీ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని కోరింది. తమ దేశంలో నివసిస్తున్న పౌరులను కూడా అప్రమత్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇండియా కు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.