FbTelugu

అమెరికా దాడులు మళ్లీ మొదలు…

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు మారుతారు కాని వారి విధానాల్లో మార్పు ఉండదు. దీనికి నిలువెత్తు సాక్ష్యం నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ తీసుకుంటున్న చర్యలే.
తూర్పు సిరియాలోని మిలిటెంట్ స్థావరాలపై అమెరికా వైమానిక దళాలు దాడులు జరిపాయి. ఇరాన్ మద్దతులో మిలిటెంట్లు చెలరేగిపోతున్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువారం నాడు అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి మిలిటెంట్లపై విరుచుకుపడింది. ఇరాక్-సిరియా సరిహద్దల్లో ఇరాన్ మిలిషియా బృందాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించగా, 17 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విదేశాల్లో చేపట్టిన తొలి దాడి ఇదే. ఇరాన్ కు మద్దతిస్తే మిలిటెంట్ బృందాలకు సంబంధించిన స్థావరాలపై దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ సైతం వెల్లడించారు. అమెరికా పౌరులు, సిబ్బంది రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా బైడెన్ వెనకాడబోరని సందేశం ఇచ్చేందుకు ఈ దాడులు చేశామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.