FbTelugu

ఇండియాకు అమెరికా సాయం 50 కోట్ల డాలర్లు

వాషింగ్టన్: సెకండ్ వేవ్ కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అమెరికా దేశం ఆపన్నహస్తం అందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇండియాకు 50 కోట్ల డాలర్ల కరోనా సాయం అందించినట్లు బుధవారం వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.

కరోనా తో అల్లాడుతున్న వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందే పలు దేశాలకు ఆక్సిజన్, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, మందులు పంపించడం జరిగిందన్నారు. త్వరలోనే మరో 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల్లో 6 కోట్లు ఆస్ట్రాజెనెకా, మరో రెండు కోట్లు ఇతర కంపెనీ వ్యాక్సిన్లు పంపించడం జరుగుతుంది. తమకు అందిన ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేటాయింపులు చేస్తామని వైట్ హౌస్ మీడియా కార్యద్రశి జెన్ సాకి వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.