FbTelugu

పరీక్షల షెడ్యూలు ప్రకటించిన యూపీఎస్సీ

ఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదాపడ్డ పలు పరీక్షల తేదీలను యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్​సీ) ప్రకటించింది.

లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూసే సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష మే 31న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ లాక్​డౌన్​తో వాయిదా పడిన విషయం తెలిసిందే. గతేడాది సివిల్​ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్​ ఎగ్జామ్స్​లో ఉత్తీర్ణులైన వారికి సంబంధించిన పర్సనాలిటీ టెస్ట్​ పైనా స్పష్టతనిచ్చింది. ఈ పరీక్షలను జులై 20 నుంచి పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

కొత్త తేదీలను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు రద్దవుతాయనే ప్రచారానికి తెరపడినట్లయింది. ఈ ఏడాది యూపీఎస్​సీ పరీక్షల షెడ్యూల్​ క్రింది విధంగా ఉంది.

-సెప్టెంబర్​ 6న ఎన్​డీఏ, ఎన్​ఏ పరీక్ష

-అక్టోబర్​ 4న సివిల్స్​ ప్రిలిమినరీ, ఐఎఫ్​ఎస్​ పరీక్ష

-అక్టోబర్​ 16న ఐఈఎస్​, ఐఎస్​ఎస్​ పరీక్ష

-2021 జనవరి 8న సివిల్స్​ మెయిన్స్​

-2021 ఫిబ్రవరి 28న ఐఎఫ్​ఎస్​ మెయిన్స్.

You might also like