FbTelugu

రూ.100 కోట్ల దిశగా ఉప్పెన కలెక్షన్లు

ఈ మధ్యకాలంలో ఏ సినిమా సాధించని విజయం ఉప్పెన్ సాధించింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన తారాగణంగా నటించిన చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం పలువురి చిత్ర ప్రముఖులను ఆశ్చర్యపరిచే విధంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. సినిమా విడుదల అయిన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. స్టార్ హీరోల సినిమాల రికార్డులను చెరిపేసిందనే చెప్పాలి. రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ రూ.7 కోట్లు వెచ్చించి డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఏప్రిల్ రెండోవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి రానున్నది. త్వరలోనే తమిళం, కన్నడం, హిందీ భాషల్లోకి రీమేక్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.